News August 9, 2024
భద్రత ఉపసంహరణపై హైకోర్టులో బాలినేని పిటిషన్

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనకు గతంలో 2+2 భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం జడ్జి వరాహ లక్ష్మీనరసింహచక్రవర్తి విచారణ చేశారు. ఏకపక్షంగా భద్రతను ఉపసంహరించారని బాలినేని తరఫు న్యాయవాది వివేకానంద పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. SRC నివేదిక మేరకు ప్రభుత్వం భద్రత ఉపసంహరించుకుందన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి చెప్పారు
Similar News
News March 15, 2026
ప్రకాశం: 7th క్లాస్ బాలికతో 9th క్లాస్ బాలుడికి పెళ్లి

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో బాల్య వివాహం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు, 9వ తరగతి చదువుతున్న బాలుడికి వాళ్ల పెద్దలు శుక్రవారం వివాహం జరిపించినట్లు ఒంగోలులోని ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందింది. చట్ట విరుద్ధమైన ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని సంస్థ ప్రతినిధి కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని కోరారు. ఆయన వెంటనే జోక్యం చేసుకొని బాలికను బాలికా సదన్‌కు తరలించాలని ఆదేశించారు.
News March 15, 2026
మార్కాపురం- శ్రీశైలం మధ్య ప్రత్యేక బస్సులు

ఉగాది పండగను పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకోసం మార్కాపురం జిల్లా నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు DM లావణ్య తెలిపారు. మార్చి 19వ తేదీ ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా సుమారు 25 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సు సర్వీసులను పెంచే అవకాశం ఉందన్నారు.
News March 15, 2026
పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు :SP

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జెరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరు ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


