News August 9, 2024

NZB: పోలీస్ కస్టడీకి యూనియన్ బ్యాంక్ మేనేజర్

image

ఖాతాదారులతో పాటు బ్యాంకును మోసగించిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న నిజామాబాద్ యూనియన్ పెద్ద బజార్ బ్యాంకు మేనేజర్ అజయ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పోలీసు కస్టడీకి జిల్లా కోర్టు అనుమతించగా శుక్రవారం ఉదయం పోలీసులు జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం 42 మంది బాధితుల నుంచి సుమారు రూ.4 కోట్ల మేర మేనేజర్ తీసుకున్నట్లు ఆరోపణల మేరకు విచారించేందుకు కస్టడీకి తీసుకున్నారు.

Similar News

News February 6, 2025

నిజామాబాద్: దొంగను పట్టుకున్న గన్‌మెన్‌కు సన్మానం 

image

దొంగను పట్టుకున్న తన గన్‌మెన్ దేవరాజ్‌ను TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు సన్మానించారు. బీసీల కులగణన లెక్కలు తేలాయని, ఎస్సీల వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం లభించిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్లో సంబరాల్లో ఉంటే ఓ దొంగ ఏకంగా 8 సెల్‌ఫోన్లను కార్యకర్తల జేబుల్లోంచి ఎవరికీ తెలియకుండా కొట్టేశాడు. సెల్‌ఫోన్లు కొట్టేస్తున్న ఆ దొంగను దేవరాజ్ చాకచక్యంగా పట్టుకోవడంతో మహేశ్ సన్మానించారు.

News February 6, 2025

కామారెడ్డి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని తీర్మానం

image

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే అరెస్టు చేయాలని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులు తీర్మానం చేశారు. బీబీపేట మండలం యాడారం గ్రామంలో రెడ్డి కులస్థులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతినిధులు బాపురెడ్డి, నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్రవర్ణ కులాలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News February 6, 2025

KMR: సైబర్ మోసాలపై జర జాగ్రత్త..!

image

సైబర్ మోసగాళ్లు అమాయకులను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కామారెడ్డి ఇందిరానగర్ ZPHSలో సైబర్ జాగృత దివస్ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ అవగాహన కల్పించారు.

error: Content is protected !!