News August 9, 2024

వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై విచారణ సాయంత్రానికి వాయిదా

image

అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ వినేశ్ ఫొగట్ చేసిన అభ్యర్థనపై విచారణ మరింత ఆలస్యం కానుంది. ఇవాళ మ.1.30కే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ విచారణ జరపాల్సి ఉండగా, అది సాయంత్రం 5.30కు వాయిదా పడింది. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వినేశ్ తరఫున వాదనలు వినిపించనున్నారు. కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Similar News

News January 9, 2026

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

image

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపునకు TG ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్సుల్లో రూ.132, ఇక 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్సుల్లో రూ.89 పెంచుకోవచ్చని పేర్కొంది. లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని సూచించింది.

News January 9, 2026

నవ గ్రహాలు – అధి దేవతలు

image

1. ఆదిత్యుడు – అగ్ని
2. చంద్రుడు – నీరు
3. అంగారకుడు – భూదేవి
4. బుధుడు – విష్ణు
5. గురు – బ్రహ్మ
6. శుక్రుడు – ఇంద్రుడు
7. శని – యముడు
8. రాహువు – దుర్గ
9. కేతువు – చిత్ర గుప్తుడు

News January 9, 2026

ధనుర్మాసం: ఇరవై ఐదో రోజు కీర్తన

image

కృష్ణుడి అనుగ్రహం కోసం గోపికలు నిద్రిస్తున్న గోపికను నిద్రలేపే సన్నివేశం ఇది. బయట ఉన్నవారు ఆమెను ‘చిలుక’ అని పిలుస్తూ త్వరగా రమ్మనగా ఆమె చమత్కారంగా బదులిస్తుంది. చివరకు కంసుని గజమైన కువలయాపీడాన్ని, శత్రువులను సంహరించిన ఆ కృష్ణుని గుణగానం చేస్తేనే వ్రతం ఫలిస్తుందని, అందరం కలిసి భగవంతుడిని కీర్తిద్దామని వారు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇలా అందరూ కలిసి భక్తితో కృష్ణుని వైపు పయనిస్తారు. <<-se>>#DHANURMASAM<<>>