News August 9, 2024
విలువైన వ్యాపారాలున్నది వీరికే
దేశంలో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీలు మొదటి స్థానంలో ఉండగా రూ.7.13 లక్షల కోట్లతో బజాజ్, రూ.5.39 లక్షల కోట్ల విలువతో బిర్లా కుటుంబాలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక AP, TG నుంచి డా.రెడ్డీస్ ప్రసాద్ (21), దాట్ల (83), ఎన్‌సీసీ రాజు (92) అరాజెన్ కేశవరెడ్డి (106), మేధాసర్వో రెడ్డి (115) నవ లిమిటెడ్ ప్రసాద్, దేవినేని (134) ఫ్యామిలీలు ఈ జాబితాలో ఉన్నాయి.
Similar News
News January 17, 2025
సంక్రాంతి ఎఫెక్ట్.. రూ.400 కోట్ల మద్యం తాగేశారు!
AP: రాష్ట్రంలో పండుగ 3 రోజుల్లో దాదాపు ₹400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో ₹150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు ₹80కోట్ల సేల్ జరుగుతుండగా, ఈ 3 రోజుల్లో ₹160cr అదనంగా అమ్ముడైంది. ఈనెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్, 2.29L కేసుల బీరు అమ్ముడైంది. గతంలో సంక్రాంతికి ఎప్పుడూ ఈ రేంజ్‌లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.
News January 17, 2025
కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే..
సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు ఇవ్వరు.
SHARE IT
News January 17, 2025
రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టాడు: KTR
TGలో ఇచ్చిన హామీలు అమలు చేయని CM రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టారని KTR విమర్శించారు. ఆయన వ్యవహారం తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని ట్వీట్ చేశారు. ‘ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, నెలకు ₹2500, తులం బంగారం, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? ₹5లక్షల విద్యాభరోసా ఎక్కడ? ఇక్కడి హామీలకే దిక్కు లేదు.. <<15169364>>ఢిల్లీలో హామీలకు గ్యారంటీ<<>> ఇస్తున్నావా?’ అని ప్రశ్నించారు.