News August 9, 2024

HYD: పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రీషెడ్యూల్

image

ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానున్నాయి. టీజీపీజీఈసీ/టీజీపీజీఈసెట్-2024 ప్రవేశాల రీషెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం 25న అర్హుల జాబితా ప్రకటిస్తారు. 29న వెబ్ ఆప్షన్ల సవరణ, సెప్టెంబర్ 1న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

Similar News

News February 20, 2026

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

image

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.

News February 20, 2026

HYD: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యాశాఖ అధికారులు!

image

స్కూల్ CBSE NOC ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ సంగీత ఫణిరాజ్, రంగారెడ్డి డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి ACB కోర్టులో హాజరుపరిచారు.