News August 9, 2024

ముంబై కాలేజీ ‘బుర్ఖా నిషేధం’పై సుప్రీం స్టే

image

ముంబైలోని చెంబూరు కళాశాల హిజాబ్, బుర్ఖాను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు ఈరోజు విచారించింది. తిలకం, బొట్టుబిల్లలకు మాత్రం ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రశ్నించింది. విద్యార్థులకు ఇష్టమైన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నవంబరుకు వాయిదా వేసింది.

Similar News

News March 6, 2026

బుమ్రా@500 వికెట్లు

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు తీశారు. ఇవాళ సెమీఫైనల్లో ENG కెప్టెన్ బ్రూక్‌ను ఔట్ చేసి ఈ క్లబ్బులో చేరారు. 2016లో అరంగేట్రం చేసిన బుమ్రా 235 మ్యాచులు ఆడారు. 18 సార్లు 5 వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఆ లెజెండరీ బౌలర్ 401 మ్యాచుల్లో 953 వికెట్లు పడగొట్టారు.

News March 6, 2026

విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఎంతంటే?

image

విజయ్ దేవరకొండ-రష్మిక తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో 4 రోజుల వేడుకల నుంచి హైదరాబాద్‌లో రిసెప్షన్‌కు వరకు రూ.15-20 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి కోసం 3 కేజీల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు టాక్. వివాహ బాధ్యతను ఓ ప్రైవేట్ ఈవెంట్ సంస్థ చూసుకోగా, వీరి పెళ్లి వీడియోను నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News March 5, 2026

వారంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్?

image

టాలీవుడ్‌లో మరో యంగ్ హీరో పెళ్లి పీఠలెక్కనున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ ఈ వారంలోనే జరుగుతుందని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వధువు వివరాలు, వివాహ తేదీ, వేదిక వివరాలను ప్రకటిస్తారని టాక్. కాగా విజయ్ దేవరకొండ-రష్మిక FEB 26న పెళ్లాడగా, రేపు(MAR 6) అల్లు శిరీష్-నయనిక వివాహం జరగనుంది.