News August 9, 2024
హ్యాపీ బర్త్‌డే SSMB: మెగాస్టార్ చిరంజీవి

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హావ్ ఎ బ్లెస్డ్ ఇయర్’ అంటూ విష్ చేశారు. కాగా ఇప్పటికే పలువురు స్టార్లు మహేశ్‌కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్, 14 రీల్స్, సురేశ్ ప్రొడక్షన్స్ తదితర అగ్ర నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి తదితర ప్రముఖులు విష్ చేసిన వారిలో ఉన్నారు.
Similar News
News March 7, 2026
రాజమండ్రి కల్తీ పాలు.. మిస్టరీ వీడింది

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం <<19223408>>ఇథిలీన్ గ్లైకాల్<<>> అనే విషపూరిత కెమికల్ పాలలో కలిసినట్లు తెలిపారు. వీటిని తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతిని పలువురు <<19320294>>మరణించినట్లు<<>> వివరించారు. కాగా గత నెలలో పాలను నిల్వ చేసే ఫ్రీజర్ చెడిపోవడంతో అందులోని కూలెంట్ లీకయ్యింది. పాలు చేదుగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేసినా వ్యాపారి గణేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
News March 7, 2026
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది. మార్చి 9 నుంచి గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సెలక్షన్స్ ప్రారంభమవుతాయి. 9, 10 తేదీల్లో మహిళలకు, 12 నుంచి 16 వరకు పురుష అభ్యర్థులకు ర్యాలీ జరుగుతుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత అభ్యర్థులు దీనికి అర్హులు. ఇంటర్ లేదా డిప్లొమాలో 50% మార్కులు ఉండాలి.
News March 7, 2026
మాయా లోకమా.. ఎత్తు మారిపోతోందేంటి?

అమెరికాలోని ‘ఒరెగాన్ వోర్టెక్స్’ సైన్స్‌కే సవాలు విసురుతోంది. ఇక్కడ అడుగుపెడితే చాలు ప్రకృతి నియమాలు తలకిందులవుతాయి. బంతిని కిందకు విసిరితే అది పైకి దొర్లుతుంది. మనుషుల ఎత్తు కూడా ఒకచోట తక్కువగా, మరోచోట ఎక్కువగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇది కేవలం కంటి భ్రమనా లేక అయస్కాంత శక్తి ప్రభావమా అనేది నేటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..


