News August 9, 2024

ఓలా.. అదిరిపోలా..

image

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేరు ధ‌ర‌ స్టాక్ మార్కెట్‌లో లిస్టైన తొలిరోజే అదరగొట్టింది. పబ్లిక్ ఇష్యూకు స్పందన అంతంత‌మాత్రంగానే ఉన్నా ఇన్వెస్టర్లకు 20% లాభాలు అందించింది. రూ. 76 ఐపీఓ ధరతో ట్రేడింగ్ ప్రారంభ‌మ‌వ్వ‌గా రూ.91.20 వ‌ర‌కు చేరుకొని డే అప్ప‌ర్ స‌ర్క్యూట్‌ని తాకింది. ఓలా లిస్టింగ్‌తో సంస్థ ఫౌండ‌ర్ భ‌వీశ్ అగ‌ర్వాల్ బిలియ‌నీర్ల జాబితాలో చేరారు.

Similar News

News November 5, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.

News November 5, 2025

ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

image

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్‌ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్‌, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు. <<-se>>#Pregnancycare<<>>

News November 5, 2025

పంజాబ్& సింధ్ బ్యాంక్‌లో 30 పోస్టులు

image

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌(<>PSB<<>>)లో 30 MSME రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్ర్కీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://punjabandsind.bank.in