News August 9, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News April 4, 2026
పంజాబ్ విజయం.. గర్వంగా ఉందన్న ప్రీతి జింటా

చెన్నైపై పంజాబ్ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల యజమాని ప్రీతి జింటా సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణంలో ఉండటం వల్ల మ్యాచ్ చూడలేకపోయానని పేర్కొన్నారు. అయితే 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన తీరు గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, కూపర్ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించారు. జట్టు సమష్టి కృషితోనే ఈ విజయం దక్కిందని కొనియాడుతూ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.
News April 4, 2026
IPL చరిత్రలో చెన్నై సరికొత్త రికార్డ్

IPL హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పంజాబ్ కింగ్స్ (PBKS)పై శుక్రవారం చేసిన 209 పరుగులతో కీలక మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఇప్పటివరకు ఏకంగా 36 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించి అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను అందుకున్న టీమ్‌గా నిలిచింది. తర్వాత స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (35 సార్లు) ఉంది. 2010లో రాజస్థాన్‌పై చేసిన 246 పరుగులు ఇప్పటి వరకు చెన్నైకి హయ్యెస్ట్ స్కోర్.
News April 4, 2026
ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ సమతుల్యతను దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్రకణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్ 2 డయాబెటిస్, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.


