News August 9, 2024
HYD: కుక్కల దాడిలో మరో బాలుడి మృతి

జవహర్‌నగర్‌లో కుక్కల దాడికి బాలుడు మృతిచెందిన ఘటన మరువకముందే HYD శివారులో మరో ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన శివ-మాధురి దంపతుల కుమారుడు క్రియాన్ష్(4) ఇటీవల స్కూల్‌కు వెళ్లి వస్తుండగా అతడిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలవగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తాజాగా బాలుడు మృతిచెందాడు.
Similar News
News February 27, 2026
HYD: ఆ రోజు ఆలయాలు బంద్!

చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న కడ్తాల్‌లోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు శివాలయ, రామాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత చెప్పారు. మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ శుద్ధి, అభిషేకం, అలంకరణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. గ్రహణం దృష్య్టా నగరంలోని ప్రముఖ ఆలయాలను సైతం మూసివేయనున్నారు.
SHARE IT
News February 27, 2026
HYD: ‘గాలి’ రిపేర్లు.. ‘అసలు’ బిల్లులు!

భూమి లోపల పైపులైన్ రిపేరు జరగదు కానీ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మాత్రం నిధులు చేరిపోతున్నాయి. పాత లీకేజీల ఫొటోలనే కొత్తవిగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో పని చేయకుండానే బిల్లులు డ్రా చేసే ‘ట్రిక్కు’ జలమండలిలో వైరల్ అయ్యింది. సెక్షన్ ఆఫీసర్ల అండదండలతోనే ఈ బోగస్ బిల్లుల దందా సాగుతోంది. థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ పేరుకే తప్ప అంతా కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఈ అవినీతి మురికిని కడగాల్సి ఉంది.
News February 27, 2026
HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.


