News August 9, 2024
సుంకిశాల ఘటనకు బీఆర్‌ఎస్సే కారణం: మంత్రులు
TG: సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత BRS ప్రభుత్వ అవినీతే కారణమని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. ఘటనా స్థలంలో పర్యటించిన సందర్భంగా మంత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఘటన చాలా చిన్నది. ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం లేదు. నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తారు. BRS నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్టు పనులు వాళ్ల హయాంలోనే జరిగాయి’ అని అన్నారు.
Similar News
News February 6, 2025
పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల
TG: పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. మరోవైపు మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. MAR 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్ 11-14 వరకు పరీక్షలు నిర్వహించనుంది.
News February 6, 2025
సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పరిణామం
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పురోగతి లభించింది. దాడి చేసిన నిందితుడిని సైఫ్ సిబ్బంది గుర్తించారు. పోలీసులు నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితుడిని వారు స్పష్టంగా గుర్తించి చూపించారు. సైఫ్‌పై దాడి చేసింది అతడేనని పోలీసులకు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News February 6, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్, పేసర్ హేజిల్‌వుడ్ దూరమైనట్లు ICC ప్రకటించింది. మడమ గాయంతో కమిన్స్, తుంటి సమస్యతో హేజిల్ ఆడటం లేదని పేర్కొంది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్ వైదొలగగా, స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ నలుగురు కీలక ప్లేయర్ల స్థానంలో మరో నలుగుర్ని AUS క్రికెట్ బోర్డు ఎంపిక చేయాల్సి ఉంది. ఈనెల 19 నుంచి CT స్టార్ట్ కానుంది.