News August 9, 2024
ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి: పురందీశ్వరి

ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను ఎంపీలు పురందీశ్వరి, దగ్గుమళ్ల ప్రసాద్ కోరారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు వినతులు సమర్పించారు. ‘తోతాపురి మామిడిని కనీస మద్దతు ధరల జాబితాలో చేర్చాలి. టన్నుకు రూ.25వేలు మద్దతు ధర ఇవ్వాలి’ అని కోరారు. ప్రధానితో చర్చించి మామిడి రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
Similar News
News January 1, 2026
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు వివిధ పాఠశాలల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రహదారి నియమాలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు విద్యార్థులకు వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత పాటించాలని సూచిస్తూ విద్యార్థులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
News January 1, 2026
X మొత్తం ఇదే.. ఇలా చేయడం నేరమే!

కొందరు X వేదికగా అమ్మాయిలు, సెలబ్రిటీల ఫొటోలను షేర్ చేస్తూ వారిని అసభ్యంగా (బికినీలో) చూపించాలని AI టూల్ ‘గ్రోక్’ను కోరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అది మెషీన్ కావడంతో అభ్యంతరకర ఫొటోలు సైతం ఎడిట్ చేసి ఇస్తోంది. అయితే ఇలా చేయడం ఇతరుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడమే. అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడం సైబర్ క్రైమ్ లాంటిదే. జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News January 1, 2026
నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్‌ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.


