News August 9, 2024
వారం రోజులకే రంగు మారిన ఒలింపిక్ మెడల్

పారిస్ ఒలింపిక్స్‌లో గెలిచిన మెడల్స్ నాణ్యంగా లేవని USA స్కేట్‌బోర్డర్ నైజా హస్టన్ ఆరోపించారు. జులై 29న జరిగిన పురుషుల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్ ఫైనల్‌లో అథ్లెట్ హస్టన్ కాంస్య పతకాన్ని గెలిచారు. అయితే, వారం రోజుల్లోనే పతకం పాతదైపోయి రంగు మారిందని ఆయన ఫొటోను పంచుకున్నారు. ఈ మెడల్ యుద్ధానికి వెళ్లి తిరిగివచ్చినట్లు కనిపిస్తోందని ఆయన రాసుకొచ్చారు. నాణ్యతపై దృష్టిసారించాలని ఆయన కోరారు.
Similar News
News March 11, 2025
టాప్-20 పొల్యూటెడ్ సిటీస్.. ఇండియాలోనే 13

ప్రపంచంలోని టాప్-20 అత్యంత కాలుష్యమైన నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నట్లు IQAir కంపెనీ వెల్లడించింది. అస్సాంలోని బైర్నిహాట్ ఇందులో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అత్యంత కాలుష్యమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. మరోవైపు 2024 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ లిస్టులో భారత్ ఐదో ర్యాంక్ పొందింది. కాగా వాయు కాలుష్యం వల్ల ఆయుర్దాయం 5.2 ఏళ్లు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
News March 11, 2025
వేసవిలో కరెంట్ బిల్లు తక్కువగా వచ్చేందుకు టిప్స్

*ఫిలమెంట్, CFL బల్బులు కాకుండా LED బల్బులు ఉపయోగించాలి.
*BLDC టెక్నాలజీతో చేసిన ఫ్యాన్లు 60% వరకు కరెంటును సేవ్ చేస్తాయి.
*BEE స్టార్ రేటింగ్ ఎక్కువ ఉన్న ఏసీ తక్కువ కరెంటును వినియోగిస్తుంది.
*ఏసీ ఎల్లప్పుడూ 24°C, అంతకంటే ఎక్కువ ఉండాలి.
*ఫ్రిజ్ డోర్ ఒక్కసారి తీస్తే అరగంట కూలింగ్ పోతుంది. పదేపదే డోర్ తీయకుండా జాగ్రత్త పడాలి.
*ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాలకు రెగ్యులర్ సర్వీసింగ్ చేయించాలి.
News March 11, 2025
జగన్‌తో రహస్య స్నేహం లేదు: సోము వీర్రాజు

AP: YS జగన్‌తో తనకు రహస్య స్నేహం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని BJP నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. CM అయ్యే వరకూ ఆయనతో పరిచయం కూడా లేదని తెలిపారు. ‘MLC టికెట్ కోసం నేను ఎలాంటి లాబీయింగ్ చేయలేదు. మంత్రిని అవుతాననేది అపోహ మాత్రమే. 2014లోనే చంద్రబాబు నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు. చంద్రబాబు, అమరావతిని నేను వ్యతిరేకించాననడం అవాస్తవం. మోదీ-బాబు బంధంలాగే మా బంధం ఉంటుంది’ అని పేర్కొన్నారు.