News August 9, 2024

పతకాలు తేని గుజరాత్‌కే ఎక్కువ ఫండ్స్: ఆజాద్

image

మణిపుర్, హరియాణా ఎక్కువ ఒలింపిక్ పతకాలు సాధించినా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ పేరుతో గుజరాత్‌కు ఎక్కువ ఫండ్స్ అందుతున్నాయని మాజీ క్రికెటర్, AITC MP కీర్తి ఆజాద్ ఆరోపించారు. ఈ మేరకు Xలో ఆయన ఓ రిపోర్ట్ పంచుకున్నారు. అందులో ఖేలో ఇండియా స్కీమ్ కింద UPకి రూ.438.27కోట్లు, గుజరాత్‌కు రూ.426.13కోట్లు వెచ్చించగా ఎక్కువ పతకాలు గెలుస్తున్న మణిపుర్‌కు రూ.46.71కోట్లు, హరియాణాకు రూ.66.59కోట్లు వెచ్చించినట్లు ఉంది.

Similar News

News March 21, 2026

తమిళనాడులో AIADMKదే పైచేయి?

image

తమిళనాడు ఎన్నికల్లో ఈసారి AIADMKదే పైచేయి అని IANS సర్వే పేర్కొనడం చర్చనీయాంశమైంది. AIADMK కూటమికి 39-40% ఓట్ షేర్ రావొచ్చని.. ఫలితంగా 234 స్థానాల్లో 114-127 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. DMK కూటమికి 104-114 సీట్లు (37-38% ఓట్ షేర్) దక్కొచ్చని పేర్కొంది. ఇక విజయ్ TVKకి 6-12 సీట్లు (14-15% షేర్) రావొచ్చని, అనేక స్థానాల్లో TVK కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చింది. <<-se>>#Elections2026<<>>

News March 21, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 21, 2026

రాజీవ్ యువ వికాసానికి రూ.6,000 కోట్లు

image

TG: బడ్జెట్‌లో ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించింది. దీంతో కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ స్కీమ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా వారికి చేయూత ఇవ్వనుంది. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పాలనుకొనే వారికి ఈ పథకం ద్వారా ఒక్కో అభ్యర్థికి గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు రుణం అందించనుంది.