News August 9, 2024

వాలంటీర్లను రెన్యువల్ చేస్తాం: మంత్రి డోలా

image

AP: వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల ఉద్యోగాలను గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. వాలంటీర్లను తాము తొలగించలేదని, వైఎస్ జగన్ చేసిన పాపం వల్లే వారికి జీతాలు రావడం లేదని అన్నారు.

Similar News

News March 22, 2026

వరి వద్దు ఈ పంటలు వేయండి: సీఎం

image

TG: కష్టం తక్కువగా ఉంటుందని రైతులు వరి పండిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలకు మన దేశంలో పండించిన వడ్లు, బియ్యం సరఫరా చేసినా ఇంకా నిల్వలు మిగిలే ఉంటున్నాయి. ఈసారి 50 లక్షల టన్నుల కంటే ఎక్కువ వరి కొనబోమని కేంద్రం చెప్పింది. ఇప్పటికే 70 లక్షల టన్నులు కొన్నాం. మిగతా వరి ఏం చేయాలి? అందుకే రైతులు మిల్లెట్లు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించాలి’ అని సిద్దిపేటలో సూచించారు.

News March 22, 2026

రైతుల కోసం రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం: రేవంత్

image

TG: ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ సిద్దిపేటలో తెలిపారు. ‘కేసీఆర్ రైతుల కోసం నెలకు సగటున రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే మేము రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉచిత కరెంటు, గిట్టుబాటు ధర, వడ్లకు బోనస్, రుణమాఫీ, రైతుభరోసా, రైతు బీమా, నష్టపరిహారం అందిస్తూ రైతును రాజును చేస్తున్నాం. ఇప్పటివరకు రైతుల కోసం రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం’ అని చెప్పారు.

News March 22, 2026

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

image

TG: సిద్దిపేట పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదల చేశారు. 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ₹3,600 కోట్లను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో రేపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. 45 రోజుల్లో 3 విడతల్లో రూ.9వేల కోట్లు అకౌంట్లలో జమ చేయనున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.