News August 9, 2024
హైదరాబాద్లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు
ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బేగంపేటలోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, వివేకానంద క్లినిక్స్ నూతన శాఖను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. హాస్పిటల్లో ఆధునిక శాస్త్ర చికిత్సకు అందజేస్తున్న టెక్నాలజీ, వైద్య సేవలను పరిశీలించారు. దేశంలో రాష్ట్రం ప్రధాన ఆరోగ్య గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
Similar News
News January 20, 2025
HYD స్విమ్మర్ సరికొత్త రికార్డు
HYD కాచిగూడకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. డిగ్రీ చదువుతున్న తన కుమారుడు స్టీఫెన్ కుమార్(20)తో కలిసి ఆదివారం అరేబియా సముద్రంలోని మండ్వాజెట్ నుంచి ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి చరిత్ర సృష్టించారు. తల్లీకుమారుడు కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి.
News January 19, 2025
HYD: రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ: కలెక్టర్లు
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు వార్డు సమావేశాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అన్నారు. మీ సేవా కేంద్రాలకు వచ్చిన 2,05,019 దరఖాస్తులను పరిశీలిస్తామని, ప్రజా పాలనలో వచ్చిన అభ్యర్థనలను కూడా పరిశీలిస్తామన్నారు.
News January 19, 2025
HYD: OYO బంద్ చేయాలని డిమాండ్
OYO హోటల్స్ బంద్ చేయాలని HYD శివారులో ఆందోళన చేపట్టారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓయో హోటల్లో మైనర్ బాలికపై అత్యాచారం, మంగళపల్లిలోని ఓ హాస్టల్లో ఉన్న విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ CPI నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య అత్యాచారం జరిగిన OYO ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన నిందితుడు, హోటల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.