News August 9, 2024

పార్వతీపురం: ఈ నెల 11 నుంచి రైళ్ల పునరుద్ధరణ

image

విశాఖ నుంచి నడిపే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ నెల 11వ తేదీ నుంచి సింహాద్రి, రత్నాచల్, ఉదయ్, గుంటూరు-రాయగడ, విశాఖ- తిరుపతి డబుల్ డెక్కర్, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించనున్నారు. 50 రోజులుగా ఈ రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని పరిశీలించిన రైల్వే అధికారులు ఈ రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు.

Similar News

News November 25, 2024

IPL వేలంలో యశ్వంత్‌కు నిరాశ

image

రెండో రోజు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్‌కు నిరాశ ఎదురైంది. త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్‌కు రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో యశ్వం‌త్ తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. తీసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజ్‌లు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

News November 25, 2024

VZM: 40 మందికి ఎస్ఐ అర్హత పరీక్షలు

image

కైలాసగిరి ఆర్మడ్ రిజర్వు కార్యాలయంలో విశాఖ రేంజ్ పరిధిలో 40 మంది ఏఎస్ఐలకు ఎస్ఐ అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఈ పరీక్షలు జరగుతున్నాయి. సోమవారం రాత పరీక్షలు నిర్వహించగా మంగళవారం అవుట్ డోర్, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్లైన వారు డిసెంబర్ 2 నుంచి తిరుపతిలో జరిగే ఎస్ఐ ట్రైనింగ్‌కు వెళతారు.

News November 25, 2024

గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం: మంత్రి

image

గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు సాలూరు మండలం కారాడవలస గ్రామంలో కంటైనర్ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం వైద్యాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కంటైనర్ ఆసుపత్రుల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.