News August 9, 2024
కృష్ణా: పీజీ పరీక్షల టైంటేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులర్&సప్లిమెంటరీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 17 నుంచి 24 మధ్య ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News March 26, 2026
కృష్ణా జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత లేదు: జేసీ

పెట్రోలు, డీజిల్ కొరతపై సంబంధిత శాఖాధికారులు స్పష్టత ఇచ్చారు. కృష్ణా జిల్లాలో మొత్తం 170 పెట్రోలు బంక్‌లు ఉండగా ఎటువంటి పెట్రోలు, డీజిల్ కొరత లేదని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. పెట్రోలు, డీజిల్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అవాస్తవాలను నమ్మి అదనంగా పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో తాత్కాలిక కొరత ఏర్పడి కొన్నిచోట్ల ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయన్నారు.
News March 26, 2026
కృష్ణా: గ్రూప్-2 శిక్షకులకు కలెక్టర్ సూచనలు

మెళకువలు తెలుసుకుని విధి నిర్వహణలో రాణించాలని కలెక్టర్ డీకే బాలాజీ గ్రూప్-2లో ఎంపికై సీసీఎల్ఎ కార్యాలయం నుంచి జిల్లాకు శిక్షణ నిమిత్తం వచ్చిన జూనియర్ అసిస్టెంట్లకు సూచించారు. జిల్లాకు శిక్షణ నిమిత్తం వచ్చిన 11 మంది జూనియర్ అసిస్టెంట్లు గురువారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రీ-సర్వేను పూర్తిగా అవగాహన చేసుకోవాలని వారికి సూచించారు.
News March 26, 2026
చల్లపల్లిలో అగ్ని ప్రమాదం

చల్లపల్లిలోని ఓ వడ్రంగి దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మేకల డొంక వద్ద ఉన్న ఉడ్ వర్క్ టింబర్ డిపోలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. ఈ ఘటనలో దుకాణ యజమాని అద్దంకి సత్యనారాయణకు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. డిజైన్ యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు వాపోయాడు.


