News August 9, 2024
జగన్ మాస్టర్ ప్లాన్.. విజయం దక్కుతుందా?

AP:విశాఖ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికను YCP చీఫ్ జగన్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అభ్యర్థి ప్రకటన, YCP ఓటర్లు(MPTC, ZPTC తదితరులు) కూటమి వైపు చూడకుండా క్యాంప్‌కు తరలించడంలో <<13760321>>చాకచక్యంగా<<>> వ్యవహరించారు. బొత్స సత్యనారాయణను గెలిపించేలా అనుసరించాల్సిన వ్యూహంపై రోజూ నేతలకు సూచనలిస్తున్నారు. అటు TDP కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో AUG 30న జరిగే ఎన్నికల్లో గెలుపెవరిదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News November 14, 2025
టాస్ ప్రాక్టీస్ చేస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్.. కారణమిదే!

కోల్‌కతాలో రేపు సౌతాఫ్రికా-ఇండియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ కెప్టెన్ బవుమా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల కేన్ విలియమ్సన్‌ను కలిశా. భారత్‌ను ఓడించేందుకు కొన్ని పాయింట్స్ అడిగా. కేన్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ టాస్ గెలవాలని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కాయిన్ టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని చెప్పారు. తాము సిరీస్ కోసం బాగానే సిద్ధమయ్యామని అనుకుంటున్నానని తెలిపారు.
News November 14, 2025
కౌంటింగ్‌లో కుట్రకు ప్లాన్: తేజస్వీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదింపజేసేందుకు రేపు కుట్ర జరుగుతుందని RJD నేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మహాగఠ్‌బంధన్ అభ్యర్థులు గెలిస్తే ప్రకటించవద్దని, తొలుత ఎన్డీయే అభ్యర్థుల గెలుపునే ప్రకటించాలని అధికారులకు చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఫోన్లు చేశారని తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News November 14, 2025
గొంతులో మటన్ ముక్క.. ఊపిరాడక వ్యక్తి మృతి

TG: నాగర్ కర్నూల్ జిల్లాలోని బొందలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి తాపీ మేస్త్రీలకు ఓ ఇంటి యజమాని దావత్ (విందు) ఏర్పాటు చేశారు. అక్కడ మటన్ తింటుండగా లక్ష్మయ్య (65) గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.


