News August 9, 2024
NZB: వణికిస్తున్న వైరల్ ఫీవర్స్
నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ నిండిపోతున్నాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరలేపాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 222 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. TGలో డెంగ్యూ కేసుల్లో NZB 3వ స్థానంలో ఉంది. దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.
Similar News
News February 6, 2025
నిజామాబాద్: దొంగను పట్టుకున్న గన్‌మెన్‌కు సన్మానం
దొంగను పట్టుకున్న తన గన్‌మెన్ దేవరాజ్‌ను TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు సన్మానించారు. బీసీల కులగణన లెక్కలు తేలాయని, ఎస్సీల వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం లభించిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్లో సంబరాల్లో ఉంటే ఓ దొంగ ఏకంగా 8 సెల్‌ఫోన్లను కార్యకర్తల జేబుల్లోంచి ఎవరికీ తెలియకుండా కొట్టేశాడు. సెల్‌ఫోన్లు కొట్టేస్తున్న ఆ దొంగను దేవరాజ్ చాకచక్యంగా పట్టుకోవడంతో మహేశ్ సన్మానించారు.
News February 6, 2025
కామారెడ్డి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని తీర్మానం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే అరెస్టు చేయాలని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులు తీర్మానం చేశారు. బీబీపేట మండలం యాడారం గ్రామంలో రెడ్డి కులస్థులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతినిధులు బాపురెడ్డి, నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్రవర్ణ కులాలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News February 6, 2025
KMR: సైబర్ మోసాలపై జర జాగ్రత్త..!
సైబర్ మోసగాళ్లు అమాయకులను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. కామారెడ్డి ఇందిరానగర్ ZPHSలో సైబర్ జాగృత దివస్ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ అవగాహన కల్పించారు.