News August 9, 2024

కప్పట్రాళ్లను సందర్శించిన కర్నూలు ఎస్పీ

image

దేవనకొండ మండల పరిధిలోని కర్నూలు మాజీ ఎస్పీ, ప్రస్తుత ఐజీ ఆకే రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్లను శుక్రవారం సాయంత్రం ఎస్పీ జీ.బిందు మాధవ్ సందర్శించారు. ప్రజలతో ఎస్పీ మమేకమయ్యారు. ప్రజల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఆకాంక్షించారు. ప్రశాంత జీవనానికి ప్రజలు ఎల్లప్పుడు ముందుండాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 14, 2026

కర్నూలు జిల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

జోహారాపురం సచివాలయంలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. ఈ పథకం కింద కర్నూలు జిల్లాలోని 2,72,757 మంది అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ.154.94 కోట్లు జమ చేసిందని కలెక్టర్ తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె వివరించారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.6వేలు జమవుతుందని తెలిపారు.

News March 14, 2026

కర్నూలు జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే..!

image

ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని కర్నూలు డీఈవో సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూళ్లు ఉదయం 7:45 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థికి భోజన వసతిని కల్పించాలన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 13, 2026

కర్నూలులో గ్యాస్ కొరతపై అపోహలు వద్దు: జేసీ

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, గృహ వినియోగదారులు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్లాంట్లలో 3-6 రోజుల స్టాక్ అందుబాటులో ఉందన్నారు. కమర్షియల్ సంస్థలు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన పెంచాలన్నారు. మార్కెట్లలో ఆహార నాణ్యత, తూనికలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు.