News August 9, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* తెనాలి అమ్మాయితో హీరో నాగచైతన్య నిశ్చితార్థం
* పల్నాడు జిల్లాలో మహిళ దారుణ హత్య
* గుంటూరులో జగన్, మహేశ్ బాబు ఫొటోలు వైరల్
* రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: అంబటి
* వినుకొండ: కిడ్నాప్‌ను చేదించిన పోలీసులు
* పులిచింతలకు భారీ వరద.. 11 గేట్లు ఎత్తివేత
* మంగళగిరి: వేధింపులతో ఉద్యోగిని సూసైడ్‌కు యత్నం

Similar News

News March 21, 2026

గుంటూరు: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

image

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ‘మిషన్ వాత్సల్య’ కింద కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కౌన్సిలర్, మేనేజర్, స్టోర్ కీపర్, హెల్పర్, పీటీ, యోగా టీచర్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు మార్చి 23 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు guntur.ap.gov.in వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు.

News March 21, 2026

గుంటూరు: CRDA కమిషనర్‌గా విజయరామరాజు

image

CRDA కమిషనర్‌గా విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇప్పటివరకు కమిషనర్‌గా పనిచేసిన కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. కాగా CRDA కమిషనర్‌గా విజయరామరాజు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో CRDA కమిషనర్లుగా చెరుకూరి శ్రీధర్, వివేక్ యాదవ్, కాటమనేని భాస్కరరావు, కన్నబాబు (ప్రస్తుతం) పనిచేశారు.

News March 21, 2026

తెనాలి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి

image

పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి(48) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ ఆనంద్ కేసు నమోదు చేశారు.