News August 9, 2024

సిల్వర్ మెడల్‌తో బల్లెం వీరుడు

image

పారిస్ ఒలింపిక్స్‌2024లో భారత్ తొలి సిల్వర్ మెడల్‌ అందుకుంది. నిన్న అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి సిల్వర్ గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఆ మెడల్‌ను తాజాగా ప్రదానం చేశారు. మెడల్‌తో నీరజ్ ఫొటోలకు పోజులిచ్చారు. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌కు గోల్డ్, మూడో స్థానంలో నిలిచిన గ్రెనెడా అథ్లెట్ పీటర్సన్‌కు బ్రాంజ్ మెడల్ వచ్చింది.

Similar News

News January 17, 2026

గ్రీన్‌లాండ్‌ విషయంలోనూ టారిఫ్ అస్త్రం

image

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. గతంలో టారిఫ్ బెదిరింపులతో యూరప్ దేశాలను ఒప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే వ్యూహాన్ని గ్రీన్‌లాండ్ విషయంలోనూ అమలు చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.

News January 17, 2026

అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

image

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.

News January 17, 2026

నేడు ప్రయాణాలు చేయవచ్చా?

image

కనుమ రోజు ఊరు దాటొద్దనే సంప్రదాయం ఉంది. అందుకే ఇంటికొచ్చిన ఆడపడుచులను తిరిగి పంపరు. కానుకలు ఇచ్చి గౌరవంగా చూసుకుంటారు. ఇక ముక్కనుమ విషయానికి వస్తే ప్రయాణాలకు అనువైన రోజని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు ఈరోజు కూడా పండుగ వాతావరణం ఉంటుందని బయలుదేరడానికి సంకోచిస్తుంటారు. కానీ ముక్కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని ఎటువంటి శాస్త్ర నియమాలు లేవు. కాబట్టి కనుమ నాడు ఆగి, ముక్కనుమ రోజున ప్రయాణాలు చేయవచ్చు.