News August 9, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓రాయపోల్ గ్రామంలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
✓అసైన్డ్ భూములు అర్హులకు అందేలా చూస్తాం:భట్టి
✓బంజారాహిల్స్: ఆదివాసి భవన్లో వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
✓5 లక్షల మంది మహిళలకు AI పై త్వరలో శిక్షణ
✓ఆగస్టు 15 నుంచి ఆర్టిసి బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే ఛాన్స్
✓క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్ విచారించాలి:హైకోర్టు

Similar News

News September 25, 2024

BREAKING: HYD: మూసీలో అధికారుల సర్వే

image

HYD అత్తాపూర్‌ వద్ద ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 4 బృందాలు కలిసి <<14194082>>మూసీలో నిర్మాణాలను<<>> పరిశీలిస్తున్నాయి. నది గర్భంలోని నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలను సేకరిస్తూ యాప్ ద్వారా నిర్ధారిస్తున్నాయి. మరోవైపు గండిపేట, రాజేంద్రనగర్ వద్ద మూసీలో అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా మూసీ నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులకు పునరావాసం కల్పిస్తామని అధికారి దాన కిశోర్ స్పష్టం చేశారు.

News September 25, 2024

BREAKING: ఆపరేషన్ మూసీ.. అక్రమ నిర్మాణాల గుర్తింపు

image

మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నది వద్ద ఇళ్లు కట్టుకున్న వారిని తరలించేందుకు రెడీ అయ్యారు. మూసీ గర్భంలో 2,166 నిర్మాణాలను అధికారులు గుర్తించగా ఇందులో HYDలో 1,595, రంగారెడ్డిలో332, మేడ్చల్‌లో 239 ఉన్నాయి. మూసీలో ప్రైవేట్ వ్యక్తులవి 16వేల నిర్మాణాలున్నాయి. కాగా పునరావాసం కింద నిర్వాసితులకు 15వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని అధికారి దానకిశోర్ తెలిపారు.

News September 25, 2024

28న ఎంజే మార్కెట్‌లో గజల్, షాయరీ

image

సిటీ వారసత్వాన్ని కాపాడడంతోపాటు, కళలను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం ఎంజే మార్కెట్ ప్రాంగణంలో గజల్, షాయరీ నిర్వహించనున్నారు. దీన్ని వినిపించడానికి ప్రముఖ కళాకారులు రాన్నారు. బుక్‌మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.