News August 10, 2024
‘నాగార్జునసాగర్‌కు ప్రత్యేక బస్సులు’

నాగార్జునసాగర్ డ్యాం గేట్లు ఎత్తినందున ఆగస్టు 10, 11 తేదీలలో ఉమ్మడి నల్లగొండ రీజినల్‌లోని అన్ని ఆర్టీసీ డిపోల నుండి సాగర్‌కి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని ఉమ్మడి నల్గొండ ఆర్ఎం M. రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
Similar News
News March 14, 2026
నల్గొండలో 40 డిగ్రీలు దాటిన ఎండలు

నల్గొండ జిల్లాలో వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మార్చి రెండో వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.4 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
News March 14, 2026
సామాన్యుడికి చికెన్ ‘షాక్’.. కిలో స్కిన్ లెస్ రూ.330

వేసవి ఎండల ప్రభావం, కోళ్ల ఉత్పత్తి తగ్గడం వల్ల జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రంజాన్ మాసం, ఇటు ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా పెరగడంతో నాన్‌వెజ్ ప్రియులు చికెన్ సెంటర్ల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. NLG మార్కెట్‌లో లైవ్ కోడి KG రూ.192, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.300, స్కిన్ లెస్ కిలో రూ.330లకు విక్రయిస్తున్నారు.
News March 14, 2026
NLG: తెల్లవారుజామున వాహనం ఢీకొని మహిళ మృతి

తిప్పర్తిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో కేశరాజ్‌పల్లి గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


