News August 10, 2024

కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాజెక్టుల UPDATE

image

నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1389.73 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 932 టీఎంసీలుగా ఉంది. కౌలాస్ నాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 454.70 మీటర్లుగా నీటి నిల్వ సామర్థ్యం 0.580 టీఎంసీలుగా ఉంది. కల్యాణి ప్రాజెక్ట్ నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 406.50 మీటర్లుగా ఉంది. ఇక సింగీతం రిజర్వాయర్ నీటి మట్టం 416.550 మీటర్లకు గాను ప్రస్తుతం అంతే స్థాయిలో 416.550 మీటర్లుగా ఉంది.

Similar News

News February 6, 2025

నిజామాబాద్‌లో చికెన్ ధరలు

image

నిజామాబాద్‌లో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ KG రూ.220 నుంచి రూ.240, విత్ స్కిన్ రూ.200 నుంచి రూ.210 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. అయితే, బాన్సువాడలో వైరస్ ప్రభావంతో కామారెడ్డిలో KG రూ. 180కి పడిపోవడం గమనార్హం. ఇంతకీ మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి.?

News February 6, 2025

NZB: రుణాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి: సెర్ఫ్ డైరెక్టర్

image

స్వయం సహాయక సంఘ సభ్యులు బ్యాంకు రుణాలు పొంది జీవనోపాధి పొందుతున్న ఆదాయ వివరాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలని సెర్ఫ్ డైరెక్టర్ ప్రశాంతి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన డీపీఎం, ఎపీఎం, సీసీ, కంప్యూటర్ ఆపరేటర్లు, గ్రామస్థాయిలో పనిచేసే అసిస్టెంట్లకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి సాయ గౌడ్, జిల్లాల అధికారులున్నారు.

News February 5, 2025

NZB: పరీక్షా కేంద్రాలను తనిఖీ

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రవి కుమార్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో 15 కేంద్రాలను తనిఖీ చేశారు.

error: Content is protected !!