News August 10, 2024
విశాఖ: ప్రోటోకాల్.. జెండా ఎగురవేసేది వీరే

అనకాపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖలో మంత్రి అనగాని సత్యప్రసాద్, అల్లూరి జిల్లాలో కలెక్టర్ దినేశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండాలు ఎగురవేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News July 8, 2025
కంచరపాలెం: ఈనెల 11న జాబ్ మేళా

కంచరపాలెం ITI జంక్షన్ వద్ద జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి అరుణ మంగళవారం తెలిపారు. 8 కంపెనీలు పాల్గొంటున్న మేళాలో టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18-45 ఏళ్లలోపు ఆసక్తి గల అభ్యర్థులు https://employement.ap.gov.in వెబ్ సైట్‌లో పేర్లు నమోదు చేసుకొని ధ్రువపత్రాలతో ఆరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.
News July 8, 2025
పరీక్షల నిర్వహణ పటిష్టంగా ఉండాలి: ఏయూ వీసీ

విద్యలో నాణ్యతను పెంచే దిశగా అనుబంధ కళాశాలలు పనిచేయాలని ఏయూ వీసీ జిపి రాజశేఖర్ అన్నారు. సోమవారం ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. పరీక్షలు నిర్వహణ పటిష్టంగా జరపాలని, లేకపోతే ఏయూ అనుబంధ కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొన్ని లోపాలు గుర్తించామని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
News July 8, 2025
గిరి ప్రదక్షిణ భక్తులకు హెల్ప్ లైన్ నంబర్లు

జూలై 9న జరగబోయే గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. 32 కి.మీలు ప్రదక్షిణలో జీవీఎంసీ తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని, భక్తులకు సమస్యలు ఎదురైతే జీవీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 0891-2507225, టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009లకు కాల్ చేయాలన్నారు.