News August 10, 2024

శ్రీకాకుళం: సెలవు దినంలో తరగతులు నిర్వహిస్తే చర్యలు

image

సెలవు దినం అయిన రేపు రెండో శనివారం, ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలలు సంపూర్ణంగా సెలవు ప్రకటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యస్ తిరుమల చైతన్య ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. సెలవులు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్‌లు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.

Similar News

News March 11, 2026

శ్రీకాకుళం పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 11, 2026

ఎచ్చెర్ల: రిజల్ట్స్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ అనురాధ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు. https://brau.edu.in/ వెబ్‌సైట్‌ను విద్యార్థులు చూడాలని పేర్కొన్నారు.

News March 11, 2026

శ్రీకాకుళం: కొనసాగుతున్న ఏసీబీ దాడులు

image

రాష్ట్ర వ్యాప్త దాడుల్లో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం సైతం ఏసీబీ సీఐలు రమణ, భాస్కర్ రావుతో కూడిన బృందం పట్టణంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనుమతులు ఇచ్చిన భవనాలు, నిర్మాణ నిబంధనలు వంటివి పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.