News August 10, 2024
‘ఓటు తప్పనిసరి’ ప్రతిపాదన లేదు: కేంద్రమంత్రి

దేశంలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన లేదని యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ఎన్నికల ముంగిట ప్రజలకు అందించే ఉచితాలపై ఆంక్షలు విధించే ప్రపోజల్స్ కూడా లేవన్నారు. సభలో ఎదురైన రెండు వేర్వేరు ప్రశ్నలకు ఆయన ఇలా స్పందించారు. మరోవైపు ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 65.79శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలియజేసిందని ఆయన సభలో చెప్పారు.
Similar News
News March 10, 2026
నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News March 10, 2026
4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. వారంలో షెడ్యూల్?

అస్సాం, కేరళ, WB, TN, పుదుచ్చేరి(UT)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. EC వారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం CEC జ్ఞానేశ్ కుమార్ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. స్థానిక పండుగలను పరిగణనలోకి తీసుకోవాలని పలు పార్టీలు ECకి విజ్ఞప్తి చేశాయి. కాగా బెంగాల్‌లో ఎన్నికలను రెండు దశల్లోనే పూర్తి చేయాలని TMC, BJP, INC, CPM, AAP నేతలు కోరారు.
News March 10, 2026
ఇండియా వల్ల క్రికెట్ భ్రష్టుపట్టింది: అక్తర్ అక్కసు

భారత్ T20WC గెలవడంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఆధిపత్యం వల్ల ఆట భ్రష్టుపట్టిందని అక్కసు వెళ్లగక్కారు. ‘ఓ రిచ్ కిడ్ తన పక్కనున్న పేదపిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం అన్నట్లుగా ఉంది ఇండియా వ్యవహారం’ అని విమర్శించారు. ఫైనల్‌కి ముందు కూడా ‘క్రికెట్ మంచి కోసం న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఆయనపై ఇండియన్ ఫ్యాన్స్ SMలో ఫైర్ అవుతున్నారు.


