News August 10, 2024
ప్రధాని మోదీకి ధన్యవాదాలు: రాహుల్

ప్రకృతి విపత్తు సంభవించిన కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియజేశారు. విధ్వంసాన్ని ప్రత్యక్షంగా మోదీ చూస్తారని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని ఆయన జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఘటనలో 200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.
Similar News
News March 21, 2026
USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News March 21, 2026
మహిళల టీ20ల్లో సంచలనం.. అతిచిన్న వయసులో సెంచరీ

అంతర్జాతీయ మహిళల T20ల్లో రువాండా దేశానికి చెందిన ఫాన్నీ ఉటగుషిమనిండే చరిత్ర సృష్టించారు. అతిచిన్న వయసులో(15 ఏళ్ల 223 రోజులు) సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా డెబ్యూ మ్యాచులోనే సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఘనాతో జరిగిన మ్యాచులో 65 బంతుల్లో 111 రన్స్ చేసి ఆమె ఈ ఘనత సాధించారు. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా ప్లేయర్ ప్రొస్కోవియా అలకో (16yrs 233days) పేరిట ఉండేది.
News March 21, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,45,970, 22 క్యారెట్ల గోల్డ్ రూ.2,750 తగ్గి రూ.1,33,800 పలుకుతోంది. అటు వెండి కిలోపై ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,50,000కి చేరింది.


