News August 10, 2024
NLG: ఈ బస్సుల్లో మహాలక్ష్మి వర్తించదు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి నాగార్జునసాగర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం రాజశేఖర్ తెలిపారు. ప్రతి డిపో నుంచి ప్రత్యేక బస్సులు సాగర్‌కు వెళతాయన్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తించదని, ప్రయాణికులంతా టికెట్ ధర చెల్లించాలని పేర్కొన్నారు. ఏడు డిపోల నుంచి శని, ఆది వారాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 11, 2026
విదేశాల్లో చదువుకోవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు వరం

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశపడే ఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరానికి గాను అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు నల్గొండ జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు (డి.డి) బి.శశికళ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 ఆఖరి గడువు.
News March 11, 2026
నల్గొండ: ‘పది’ పరీక్షలకు 19,845 మంది విద్యార్థులు

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం 109 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఏడాది మొత్తం 19,845 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 19,698 మంది రెగ్యులర్ కాగా, 137 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. గతంలో ఉన్న ఒక్క నిమిషం నిబంధనను ఈసారి సడలించారు.
News March 11, 2026
నల్గొండ: మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల ఊసేదీ?

జిల్లాలో కొత్త మున్సిపల్ కౌన్సిళ్లు ఏర్పడి రోజులు గడుస్తున్నా, ఇంతవరకు సమావేశాల ఊసే లేకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదానికి కేవలం 20 రోజుల గడువు మాత్రమే ఉండటంతో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమోదం పొందుతామని స్పష్టం చేశారు.


