News August 10, 2024

విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌కు మంగళవారం సెలవు

image

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20833/20834) షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. ప్రస్తుతం ఆదివారం నిర్వహణ పనుల కోసం రైలును నిలిపేస్తున్నారు. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి ఆదివారం కూడా రైలు నడపాలని నిర్ణయించారు. బదులుగా మంగళవారం ఈ రైలు నడవదు.

Similar News

News August 31, 2025

పర్యాటక రంగంలో రూ.12వేల కోట్ల పెట్టుబడులు: దుర్గేశ్

image

AP: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఇప్పటివరకు ఈ రంగానికి ₹12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. టూరిస్టు సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నామని, లంబసింగి, వంజంగి, అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అటు విశాఖ MGM గ్రౌండ్స్‌లో SEP 5 నుంచి 3 రోజుల పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది.

News August 31, 2025

ఉద్యోగుల ఖాతాల్లోకి పెండింగ్ బిల్లులు

image

TG: ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి దాదాపు ₹700 కోట్లను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఉద్యోగుల సప్లిమెంటరీ వేతన బిల్లులు ₹392 కోట్లు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కింద మరో ₹308 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఇంకా ₹10వేల కోట్ల వరకు బిల్లులు రావాలని తెలిపారు. కాగా ఉద్యోగుల బిల్లులకు ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లిస్తామని జూన్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

News August 31, 2025

థాంక్యూ జగన్ గారు: అల్లు అర్జున్

image

AP: అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మరణించడం పట్ల మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ X వేదికగా సంతాపం తెలిపారు. ‘క‌న‌క‌ర‌త్న‌మ్మ గారు మృతిచెందడం బాధాక‌రం. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ స్పందించారు. ‘థాంక్యూ జగన్ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు చాలా సంతోషం’ అని కామెంట్ చేశారు.