News August 10, 2024
చింతకాని: కరెంటు షాక్‌కు గురై యువకుడు మృతి

కరెంటు షాక్‌కు గురై ఓ యువకుుడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చింతకాని మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నామవరంకి చెందిన బొలికొండ బాను(28) ఈనెల 2 కరెంటు షాక్ గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
Similar News
News April 4, 2026
ఖమ్మం:దివ్యాంగ విద్యార్థులకు ‘డిజిటల్’ భరోసా

వైకల్యం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక సాయం అందిస్తోంది. జిల్లాలో ఉన్నత విద్య చదివే వారికి 47 ల్యాప్‌టాప్‌లు, ఇంటర్ విద్యార్థులకు 25 ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు 100 మోటార్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లను కేటాయించారు. డిజిటల్ విద్యతో సామాన్య విద్యార్థులతో పోటీపడేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత తెలిపారు.
News April 4, 2026
ఖమ్మం: ALERT.. 2 రోజులు బంద్..!

కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి సుమారు 36 గంటల పాటు ఈ అంతరాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో, తిరిగి సోమవారం ఉదయం నుంచి సేవలు యథావిధిగా అందుబాటులోకి రానున్నాయని, వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.