News August 10, 2024

గోల్డ్ మెడలిస్ట్‌ నదీమ్‌కు 10 కోట్ల(PKR) బహుమతి

image

ఒలింపిక్స్: జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌‌కు పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియమ్ నవాజ్ 10 కోట్ల(PKR) బహుమతి ప్రకటించారు. అలాగే అతని హోం సిటీ ఖనేవాల్‌లో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని తెలిపారు. జావెలిన్ కొనుగోలు చేయడానికీ డబ్బులు లేక ఇబ్బంది పడిన అతనిపై ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. కాగా ఈ ఈవెంట్‌లో భారత స్టార్ నీరజ్ చోప్రా రజతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Similar News

News March 3, 2026

నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!

image

TG: బిడ్డ కడుపులో పడగానే తల్లి సంతోషం అంతాఇంతా కాదు. పుట్టాక బిడ్డను ఎన్నిసార్లు ముద్దాడుతుందో.. అందంగా అలంకరించి ఎంతగా మురిసిపోతుందో మాటల్లో వర్ణించలేని అనుభూతి. పిల్లలకు జ్వరమొస్తేనే తట్టుకోలేని తల్లి వారి ఊపిరినే ఆపడం గుండెలు పిండేసే విషాదం. భువనగిరి(D) గొల్లగూడెంలో 10 నెలల బాబు, పాప(2)ను చంపి తానూ తనువు చాలించిందో తల్లి. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తున్నా పిల్లలను చంపడం కంటతడి పెట్టిస్తోంది.

News March 3, 2026

కప్పు కొట్టాలంటే ఈ లోపాలు సరిదిద్దుకోవాల్సిందే!

image

టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరినప్పటికీ టైటిల్ గెలవడం అంత ఈజీ కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ ఫామ్ కోల్పోవడం, బౌలింగ్‌లో బుమ్రాపైనే ఆధారపడటం బలహీనతలుగా మారాయి. టోర్నీలో పేలవమైన క్యాచ్‌ల రికార్డ్ ఆందోళనకరం. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలమవుతుండటంతో ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరి వ్యక్తిగత మెరుపులపైనే టీమ్ ఆధారపడుతోంది. ఇంగ్లండ్‌తో పోరులో సమష్టిగా రాణించకపోతే కప్పు కలగానే మిగిలిపోతుంది!

News March 3, 2026

వాళ్లు నన్ను చంపేస్తారు: ఇరాన్ హీరోయిన్

image

ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం దిగిపోయేవరకు తాను ఆ దేశంలో అడుగుపెట్టలేనని సాక్రెడ్ గేమ్స్ ఫేమ్, ఇరానియన్ హీరోయిన్ ఎల్నాజ్ నొరౌజీ అన్నారు. ఖమేనీ మృతి విషయం తెలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఇటీవల ఆమె వార్తల్లో నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇరాన్‌ వెళ్తే చంపేస్తారని వ్యాఖ్యానించారు. కాగా ఎనిమిదేళ్ల వయసులో ఆమె ఇరాన్‌ను వీడారు. తర్వాత యూరప్‌లో మోడలింగ్‌ నేర్చుకున్నారు. ప్రస్తుతం INDలోనే ఉన్నారు.