News August 10, 2024

ఈవీఎంల చెకింగ్.. ఒంగోలులోనే ఎందుకు.?

image

ఒంగోలులో ఈ నెల 19 నుంచి 24వరకు ఈవీఎంల పరిశీలన జరగనుంది. దీనికి కారణం ఏంటంటే.. ఇటీవల ఎన్నికల్లో అవకతకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ.. ఈవీఎంల పరిశీలనకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బెల్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేసిన వారికి డమ్మీ బ్యాలెట్‌లు ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియ చూపించనున్నారు. 12పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను పరిశీలించనున్నారు.

Similar News

News April 6, 2026

మార్కాపురం అటవీ శాఖలో ఉద్యోగాలు

image

మార్కాపురం అటవీ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్‌లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం పలికారు. మార్కాపురం జిల్లాలో పనిచేయుటకు ఏదైనా డిగ్రీ కలిగి, MS ఆఫీస్, టైప్ స్కిల్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీటెక్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీలోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు మార్కాపురం అటవీ శాఖ కార్యాలయానికి రావాలన్నారు.

News April 6, 2026

తౌషిక్ మృతి కేసు.. ఆ డేటానే కీలకం..!

image

నవోదయ విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పునః విచారణలో భాగంగా ఆదివారం మొత్తం 13 ఫోన్లను విచారణాధికారి సీజ్ చేశారు. ఇందులో కళాశాల యాజమాన్యం, ఒక మహిళా టీచర్, వార్డెన్ ఫోన్లతోపాటు సింగరాయకొండ పోలీసుల ఫోన్లు, పోస్టుమార్టం నిర్వహించిన ఒంగోలు రిమ్స్ డాక్టర్ ఫోన్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కాల్ డేటా ఆధారంగా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

News April 5, 2026

భైరవకోన పూజారిపై కత్తితో దాడి

image

సీఎస్ పురం మండలం భైరవకోన దేవస్థానం పూజారిగా పని చేస్తున్న రామమూర్తి ఆలయ సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర ఉండగా ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఒక్కసారిగా బైక్‌పై వచ్చి భుజం దగ్గర 2 సార్లు కత్తితో పొడిచాడని పూజారి చెప్పుకొచ్చారు. స్థానికులు పూజారిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.