News August 10, 2024
INDIA కూటమి సంచలన నిర్ణయం?
రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖడ్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆర్టికల్ 67(బి) కింద ఉపరాష్ట్రపతి తొలగింపునకు ఇచ్చే నోటీసుపై 80 మంది విపక్ష సభ్యులు సంతకాలు చేశారు. ఇటీవల సభలో ఛైర్మన్ వ్యవహరించిన తీరు, ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 18, 2025
సెమీ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి ఓటమి
ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ డబుల్స్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్‌లో మలేషియా జోడీ గోహ్ స్జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్ 21-18, 21-14 తేడాతో గెలిచింది. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇప్పటికే పీవీ సింధు కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా 21-9, 19-21, 21-17 తేడాతో గెలిచారు.
News January 18, 2025
అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ
AP: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం డిన్నర్ చేశారు.
News January 18, 2025
జియో రీఛార్జ్ ప్లాన్.. రూ.49కే..
ప్రముఖ టెలికం కంపెనీ జియో రూ.49కే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 24 గంటలు. ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ మంచి ఆప్షన్. కానీ ఇందులో కాలింగ్, SMS సౌకర్యం పొందలేరు. రూ.11కే గంటపాటు అన్‌లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌ను కూడా Jio తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి తీవ్రపోటీ ఎదుర్కొంటున్న Airtel, VI, BSNLకి ఈ కొత్త ప్లాన్లు మరింత సవాలుగా మారే అవకాశాలున్నాయి.