News August 10, 2024

నాలాల్లో నీటి నిల్వ వల్ల దోమల బ్రీడింగ్‌కు అవకాశం: ఆమ్రపాలి

image

HYD నగరంలో వరద నీటి కాలువలో నీరు నేరుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. నాలాల్లో నీటి నిల్వ వల్ల దోమల బ్రీడింగ్‌కు అవకాశం ఉందన్నారు. అలాంటి సందర్భంలో దోమలు వ్యాప్తి చెందకుండా పూడికతీత చేపట్టాలని అధికారులకు సూచించారు. స్మార్ట్ వాటర్ డ్రైన్, మూసీ నదిలో వరద నీరు నేరుగా వెళ్లకపోవడం మూలంగా నిల్వ ఉండిపోతున్నాయన్నారు. ఫలితంగా దోమల వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు.

Similar News

News November 28, 2024

HYDలో మరో ముఠా.. ప్రజలు జాగ్రత్త..!

image

HYD ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వీధుల్లో లేడీస్ సూట్లు, వెచ్చటి దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా వచ్చిందన్నారు. ఈ ముఠా సభ్యులు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్‌స్టర్లు బట్టలు అమ్మేవారిగా, చౌకైన వస్తువులను విక్రయించే వారిగా కాలనీల్లోని గృహాలు, షాపుల్లో రెక్కీ నిర్వహిస్తారని శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

News November 27, 2024

జియో ఫిజిక్స్ విభాగంలో ప్రాజెక్ట్ ఫెల్లో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ జియో ఫిజిక్స్ విభాగంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ జియో ఫిజిక్స్‌లో ప్రాజెక్ట్ ఫెల్లో పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు  తెలిపారు. ‘గ్రావిటీ సర్వేస్ ఇన్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, ఇండియా’ పేరుతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులను తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News November 27, 2024

HYD: ఎన్యుమరేటర్లకు సహకరించాలి: వేం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కులగణన సర్వే అధికారులు, ఎన్యుమరేటర్లు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన సర్వేలో కుటుంబ వివరాలు తెలిపారు. అధికారులకు ప్రతి కుటుంబం సహకరించాలని తెలిపారు. ఈ సర్వే ప్రతి కుటుంబ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలకు ప్రణాళిక వేయటానికి ఉపయోగపడుతుందని వేం నరేందర్ రెడ్డి అన్నారు.