News August 10, 2024
వచ్చే ఏడాది DEC 19న అవతార్-3 రిలీజ్

విజువల్ వండర్ అవతార్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ మూవీ వచ్చే ఏడాది డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు ఇవాళ ప్రకటించారు. పండోరా గ్రహంలోని కొత్త జీవులు, సంస్కృతుల గురించి ఇందులో చూడబోతున్నారని డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చెప్పారు. నాలుగో భాగం 2029 డిసెంబర్ 21, చివరి పార్ట్ 2031 డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
Similar News
News March 16, 2026
కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.
News March 16, 2026
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి

98వ ఆస్కార్ అవార్డుల ప్రకటన సందర్భంగా గత ఏడాది కాలంలో చనిపోయిన సినీ ప్రముఖులకు అకాడమీ నివాళులర్పించింది. వీరిలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు, బాలీవుడ్ యాక్టర్స్ ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్ ఉన్నారు. రాబ్ రైనర్, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, రాబర్ట్ డువాల్, కేథరీన్ ఓహారా, డయాన్ కీటన్ వంటి హాలీవుడ్ తారలనూ అకాడమీ గుర్తు చేసుకుంది.
News March 16, 2026
వారికి రూ.2,500 స్కాలర్‌షిప్?

TG: GOVT జూనియర్ కాలేజీల్లో చదివే దివ్యాంగ, ట్రాన్స్‌జెండర్, మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక స్కూటర్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. 10th మార్కుల ఆధారంగా ఏటా 40వేల మందికి ₹2,500 చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ 2 స్కీమ్‌లను ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది నుంచి అమలు చేయనుంది. కాగా ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఫ్రీగా EV స్కూటీలు ఇస్తామని CM రేవంత్ <<19350603>>ప్రకటించిన<<>> సంగతి తెలిసిందే.


