News August 10, 2024
ఏపీలో ప్రాజెక్టుల పేర్ల మార్పు

APలోని 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గత TDP ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా, వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా మార్చింది. వరికపూడిశెల, సంగం బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్, హంద్రీనీవా సుజల స్రవంతి పేర్లనూ పునరుద్ధరించింది.
Similar News
News March 16, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన కేంద్ర మంత్రి కూతురు

కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ కూతురు హిమాయని ఢిల్లీ హైకోర్టులో ₹10Crకు పరువు నష్టం దావా వేశారు. US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో తనకు సంబంధం ఉన్నట్లు కొందరు SMలో తప్పుడు ప్రచారం చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ కంటెంట్‌ను తొలగించాలని కోరారు. కాగా ఎప్‌స్టీన్‌తో హర్దీప్ పూరీకి సంబంధాలున్నట్లు 2014-15 మధ్య విమర్శలు రాగా ఆయన ఖండించారు.
News March 16, 2026
LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్‌లు: CBN

AP: గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు పోకుండా చూడాలని CBN కంపెనీల అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, గుడులకు గ్యాస్ సరఫరా ఆగకుండా చూడాలన్నారు. ప్రజల్లో ఆందోళన లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్స్ వినియోగించేలా చేయాలన్నారు. LPG వాడకం తగ్గించేలా హోటళ్లతో చర్చించాలని సూచించారు. రాష్ట్రంలో 17,209MT స్టాక్ ఉందని CMకు అధికారులు తెలిపారు.
News March 16, 2026
మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ కన్నుమూత

TG: ఉమ్మడి ఆదిలాబాద్(D) ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్(71) అనారోగ్యంతో మృతిచెందారు. దండేపల్లి(M) లింగాపూర్‌లోని తన స్వగృహంలో ఈరోజు తుది శ్వాస విడిచారు. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి సారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా(1985) గెలుపొందిన ఆయన, ఆ తర్వాత TDP(1994), BRS(2004) నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


