News August 10, 2024

ఇండియాలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్ పేల్చనుందా?

image

అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందంటూ నివేదిక బయటపెట్టిన హిండెన్‌బర్గ్ మరో సంచలనానికి తెరతీయనున్నట్లు ప్రకటించింది. ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఇవాళ Xలో పోస్టు చేసింది. దీంతో భారత మార్కెట్లు మరోసారి కుదుపునకు లోనయ్యే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా హిండెన్‌బర్గ్ నివేదిక అసత్యమని సెబీ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

Similar News

News March 17, 2026

IPL స్కోర్‌కార్డ్స్.. ఏది నచ్చింది?

image

ఐపీఎల్ అంటే ఆట మాత్రమే కాదు.. స్క్రీన్‌పై కనిపించే స్కోర్‌కార్డ్ గ్రాఫిక్స్ కూడా స్పెషలే. 2008 నుంచి 2025 వరకు వీటి డిజైన్లు మారుతూ వచ్చాయి. 2014-15 నాటి గ్లాసీ లుక్, 2016 నాటి ఫ్యూచరిస్టిక్ డిజైన్లు ‘బెస్ట్’ అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే 2011-12 నాటి పాత డిజైన్లు, 2023-24లో వాడిన ఇటాలిక్ ఫాంట్లు అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. పాత డిజైన్లకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇంతకీ మీ ఫేవరెట్ ఏది? COMMENT

News March 17, 2026

రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

image

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.

News March 17, 2026

KKRకు గాయాల ‘దెబ్బ’

image

IPL ప్రారంభానికి ముందు KKRను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇంజూరీతో హర్షిత్ రాణా <<19394540>>నడవలేని <<>>స్థితిలో ఉన్నారు. T20 WC సందర్భంగా గాయపడ్డ శ్రీలంక పేసర్ పతిరణ ఆడటం కూడా అనుమానంగా మారింది. KKR అతడిని రూ.18Crకు కొనుగోలు చేసింది. అయితే ఏదో ఒక దశలో పతిరణ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది. పతిరణ, రాణాకు రీప్లేస్‌మెంట్‌ తీసుకోవద్దని నిర్ణయించింది. ముస్తాఫిజుర్ ప్లేస్‌లో <<19375126>>ముజరబానిని<<>> తీసుకుంది.