News August 10, 2024

ఉమ్మడి తూ.గో.లో పిడుగులు పడే అవకాశం

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ, కాకినాడ రూరల్, తుని, పెద్దాపురం, అనపర్తి, సామర్లకోట, రాజమండ్రి రూరల్, రంపచోడవరం, ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ మేరకు ప్రజల ఫోన్లకు పిడుగుపాటు హెచ్చరికల సందేశాలు పంపించారు.

Similar News

News March 15, 2026

ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం, డివిజన్, మండల కేంద్రాల్లో ‘PGRS’ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల ప్రస్తుత స్థితి, ఇతర వివరాల కోసం 1100 నంబర్‌కు నేరుగా కాల్ చేయవచ్చని ఆమె సూచించారు.

News March 15, 2026

డాక్టర్ గోరంట్లకు నారా భువనేశ్వరి ఘన సత్కారం

image

NTR ట్రస్ట్, GSR మెడికల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో డా.గోరంట్ల రవిరాం కిరణ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. HYDలోని టీడీపీభవన్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. భువనేశ్వరి ఆహ్వానం మేరకు వెళ్లిన డాక్టర్ గోరంట్లను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పేదలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు.

News March 15, 2026

తూ.గో జిల్లాలో YCP కొత్త పరిశీలకుల నియామకం

image

తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు నూతన పరిశీలకులను YCP ఆదివారం నియమించింది. కొవ్వూరుకు గొందేశి శ్రీనివాసరెడ్డి, అనపర్తికి తులసి కుమార్, రాజానగరానికి చందన నాగేశ్వర్, నిడదవోలుకు గిరజాలబాబు, గోపాలపురానికి తోటరామకృష్ణ, రాజమండ్రి సిటీకి అద్దంకి ముక్తేశ్వరరావు నియమితులయ్యారు. ఈ నియామకాల ద్వారా పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యత పెరుగుతుందని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి.