News August 10, 2024

జగన్ వస్తే అవకాశం ఇస్తాం: స్పీకర్ 

image

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని ఎమ్మెల్యే మాత్రమేనని అసెంబ్లీకి రావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. సమావేశాలలో అసెంబ్లీకి హాజరవ్వటం శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత అన్నారు.

Similar News

News March 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
➤ 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,770
➤ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,508
➤ వెండి 10 గ్రాముల ధర రూ.2,720.

News March 12, 2026

కడప: రేపు వైవీయూ కాన్వకేషన్ .. ఏర్పాట్లు పూర్తి

image

యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు లోపు విద్యార్థులు తిరుపతి బైపాస్ రోడ్డులోని డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందన్నారు. వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తామన్నారు.

News March 12, 2026

కడప: రేపు రూ.125.97 కోట్లు అకౌంట్లోకి జమ

image

కడప జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ- పీఏం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులు డేటాను సిద్ధం చేశారు. మూడో విడత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 2,15,283 మంది రైతులకు రూ.125.97 కోట్లు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ కింద రూ.86.11 కోట్లు, PM కిసాన్ కింద రూ.39.86 కోట్లు విడుదల చేయనున్నారు.