News August 10, 2024

నెల్లూరు: భిన్న ధ్రువాలు కలిసిన వేళ

image

నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని శాలువా పుష్పగుచ్ఛం అందించి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ సత్కరించారు. శనివారం జడ్పీ సమావేశానికి మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చాలాకాలం తర్వాత ఈ సఖ్యత నెల్లూరు నగరంలో చర్చాంశనీయంగా మారింది.

Similar News

News March 10, 2026

కావలి: మామిడి తోటలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

image

కావలి రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన నూకల పాటి శివప్రసాద్ రెడ్డి (65) మంగళవారం మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి కాంతమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News March 10, 2026

నెల్లూరు: మహిళ దారుణ హత్య

image

నెల్లూరు వనంతోపు సెంటర్‌కు చెందిన వెంకయ్య, తన భార్య హజరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వీరు పల్నాడు జిల్లా నరసరావుపేట(M) ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు స్పందించి, నిందితుడు వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు. పాత సామాన్లు ఏరుకుంటూ జీవనం సాగించేవారని గుర్తించారు.

News March 10, 2026

25,305 మంది ఆడపిల్లలకు HPV వ్యాక్సిన్: DMHO

image

జిల్లాలోని 52 PHC, 29 పట్టణ PHCలు, 10 CHCలతోపాటు GGH ఆత్మకూరు, కావలి, గూడూరు ఏరియా ఆసుపత్రులలోనూ ఈ HPV వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు DMHO సుజాత తెలిపారు. ఉచితంగా వేసే ఈ HPV వ్యాక్సిన్‌ను ఎంపిక చేసిన ఆడపిల్లలకు 0.5 ml డోస్‌ను బుధవారం నుంచి ఇవ్వననున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 14 ఏళ్లు పైడి 15 ఏళ్లలోపు ఆడపిల్లలు 25,305 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు.