News August 10, 2024
స్పీకర్ ఓంబిర్లాను కలిసిన ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్

ఢిల్లీలో పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాను జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షేట్కార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిపక్షం తరఫున పార్లమెంట్‌లో తనకు మాట్లాడేందుకు అధిక సమయాన్ని కేటాయించాలని షెట్కార్ స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు.
Similar News
News March 13, 2026
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్: కలెక్టర్

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.
News March 13, 2026
గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధి: కలెక్టర్

గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సర్పంచులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత, పెన్షన్లు, ఉపాధి హామీ, పాఠశాలల పర్యవేక్షణపై అధికారులు సూచనలు ఇచ్చారు.
News March 12, 2026
మెదక్: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ కార్యాలయంలో 9848214166 కంట్రోల్ రూమ్ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పట్టుదల, క్రమశిక్షణతో చదివి మెదక్ జిల్లాను పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లాలో ఇందుకోసం మొత్తం 68 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


