News August 10, 2024
NZB: 465 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం, వ్యక్తి అరెస్ట్

ఎండు గంజాయిని సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టివిఎస్ వాహనంపై ఎండు గంజాయిని తీసుకుని వెళ్తున్న షేక్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 465 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో దిలీప్, ఎస్సై మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 31, 2025
NZB: NDRF, SDRF సేవలు భేష్..

ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలలో NDRF, SDRF బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగామన్నారు.
News August 31, 2025
NZB: ఉమ్మెడ బ్రిడ్జిని పరిశీలించిన సీపీ

నందిపేట్ ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన స్థలాన్ని సీపీ సాయి చైతన్య శనివారం సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే లో చూడాలని పోలీసులకు ఆదేశించారు.
News August 30, 2025
NZB: చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఆనుకుని దిగువన గల పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంబూషియా చేప పిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్ ను సందర్శించారు. గంబూషియా చేప పిల్లలను పెద్ద సంఖ్యలో పెంచాలని నిర్వాహకులకు సూచించారు.