News August 10, 2024

స్వర్గం నుంచి మీ తల్లిదండ్రులు చూస్తుంటారు అమన్: సచిన్

image

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ‘భారత్ తరఫున అత్యంత చిన్న వయస్సులో పతకం గెలిచిన అమన్ సెహ్రవాత్‌కు కంగ్రాట్యులేషన్స్. ఇది మీ విజయం మాత్రమే కాదు, మొత్తం భారత రెజ్లింగ్‌ది. ప్రతి భారతీయుడూ మీ విజయం పట్ల గర్విస్తున్నాడు. స్వర్గం నుంచి మీ తల్లిదండ్రులు నిన్ను చూస్తూ గర్వపడుతుంటారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 12, 2026

ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర ద్వారానే అమలవ్వాలి: కాటమనేని

image

AP: అంతరాయం లేకుండా ప్రభుత్వ సేవలు అందించేందుకు అన్ని శాఖలు మనమిత్ర యాప్ ద్వారా వాటిని అమలు చేయాలని IT కార్యదర్శి కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు. ‘కొన్ని శాఖలు ఇప్పటికీ మాన్యువల్‌గా సేవలు కొనసాగిస్తున్నాయి. డేటా అనుసంధానం ప్ర‌క్రియ పూర్తి చేసి యూజ్ కేసెస్ సిద్ధం చేస్తున్నాం. AI ఆధారితంగా ఉప‌యోగ‌ప‌డే 98 కేసెస్‌ను ఇప్ప‌టికే సిద్ధం చేశాం. APR నాటికి పూర్తిగా వాటిని అందుబాటులోకి తెస్తాం’ అని తెలిపారు.

News January 12, 2026

కేంద్ర బడ్జెట్.. దేశ చరిత్రలో తొలిసారి..

image

ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.

News January 12, 2026

పండగకు ఏ చీర కొంటున్నారు?

image

పండుగ సమయంలో మంగళగిరి పట్టు చీర ధరిస్తే హుందాగా ఉంటుంది. ఇవి తక్కువ ధరల్లో ఫ్యాన్సీ రకాల్లో మార్కెట్లో లభిస్తాయి. యువతులకైనా, మధ్యవయస్కులకైనా ఇవి సూపర్‌గా ఉంటాయి. పైథానీ పట్టు చీర మెరుస్తూ మంచి లుక్‌ ఇస్తుంది. గద్వాల్ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పట్టులో కాకుండా ఫ్యాన్సీలో ట్రెండీగా కనిపించాలనుకుంటే ప్రింట్ చీరలు తీసుకోవచ్చు. ఏవి కట్టుకున్నా దాన్ని హుందాగా క్యారీ చేస్తే అందరి దృష్టీ మీ పైనే..