News August 10, 2024

ఇసుక పాలసీపై రాజమండ్రి కలెక్టరేట్‌లో సమీక్ష

image

పేదల సొంత ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశ పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఇసుక పాలసీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక పాలసీ విధానంపై ఆరా తీశారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 15, 2026

అనపర్తి ‘సెంటిమెంట్’ ఏంటో తెలుసా?

image

1952లో అనపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది. 14 సార్లు జరిగిన ఎన్నికలలో 12 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. అయితే, ఒక వింతైన విషయం ఏమిటంటే, అనపర్తి నుంచి గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మంత్రిగా అవకాశం పొందలేదు. దీనిని స్థానికులు ఒక ‘సెంటిమెంట్’గా భావిస్తారు.

బిక్కవోలుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు గ్రామానికి ఆ పేరు వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. దీనిని పూర్వం ‘బిరుదాంకినవోలు’ అని పిలిచేవారు. తూర్పు చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని బిరుదుల ఆధారంగా ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ద్రవిడ శైలి శివాలయాలు, ఏకశిలా గణపతి విగ్రహం చాళుక్యుల కాలం నాటి ఉన్నతమైన శిల్పకళా వైభవానికి, వారి మతపరమైన ఆసక్తికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.