News August 10, 2024
వీరిని పట్టిస్తే రూ.20 లక్షల రివార్డు

నలుగురు ముష్కరుల ఊహా చిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. వీరి ఆచూకీ చెబితే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేస్తామని తెలిపారు. కథువా జిల్లాలో మచేడీలో పెట్రోలింగ్ చేస్తున్న ఐదుగురు సైనికులపై జులై 8న బురద ప్రాంతాల్లో దాక్కొని ఈ టెర్రరిస్టులు దాడి చేశారు. ఘటనలో ఒక జవాన్ మరణించారు. జులై 15న కూడా ఇలాంటి దాడే జరిగింది. జైష్ ఏ మహ్మద్ షాడో గ్రూపులే ఇలా చేస్తున్నాయని సమాచారం.
Similar News
News March 17, 2026
SGSW ఉద్యోగులు.. ఆలస్యమైతే లీవ్ కట్

AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (SGSW) ఉద్యోగుల హాజరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 10.30amలోగా హాజరు నమోదు చేయాలని, 10min గ్రేస్ టైమ్ ఉంటుందని స్పష్టం చేసింది. 10.40am తర్వాత హాజరు నమోదైతే హాఫ్ డే సెలవుగా, 2.01pm-5pm మధ్య హాజరు నమోదైతే పూర్తి రోజు సెలవుగా పరిగణించనుంది. ఉద్యోగుల అటెండెన్స్ యాప్‌లో ఈ నిబంధనలు కనిపిస్తున్నాయి. DDO అనుమతితో నెలకు 3 రోజులు దీని నుంచి మినహాయింపు పొందొచ్చు.
News March 17, 2026
జగ్గారెడ్డి PCC చీఫ్ అయితే 100 సీట్లు గ్యారంటీ: కోమటిరెడ్డి

TG: PCC చీఫ్‌గా జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్‌గా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘జగ్గారెడ్డి మరొక PJR. ఆయన లాగే ప్రజా నాయకుడు. జగ్గారెడ్డి PCC చీఫ్‌గా ఉంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లలో గెలుస్తుంది. మహేశ్ గౌడ్‌ను తొలగించి జగ్గారెడ్డిని PCC చీఫ్‌గా చేయాలి’ అని సూచించారు.
News March 17, 2026
డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.


