News August 10, 2024

HYDలో త్వరలో 5 ఎకరాల్లో ఫుట్‌బాల్ కోర్టులు!

image

గ్రేటర్ HYD నగరంలో ఫుట్‌బాల్ పై ఆసక్తి పెంచడంతో పాటు, క్రీడాకారులను తయారు చేసినందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రచిస్తోంది. అనువైన ప్రాంతాల కోసం అన్వేషిస్తోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో జోన్ ప్రాంతంలో ఒక్కో ఫుట్ బాల్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 14, 2026

సమ్మర్ ఎఫెక్ట్.. HYDలో KG@325

image

ఎండకాలం ప్రారంభంలోనే చికెన్ ధరలు కొండెక్కాయి. శనివారం KG చికెన్ రూ.325 నుంచి 330 వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్‌తో కూడిన చికెన్ ధర రూ.286గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.325కు చేరుకుంది. వేసవి మొదలులో ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని చికెన్ ప్రియులు సందేహ పడుతున్నారు. మీ ఏరియాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 14, 2026

HYD: రూ.5‌కే భోజనం.. గ్యాస్ ఇబ్బందులు లేవు!

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5 కే భోజనానికి గ్యాస్ ఇబ్బంది ఇప్పట్లో లేనట్లే. ఎందుకంటే ఇక్కడ అన్నం, పప్పును సోలార్ ప్యానల్ ద్వారా వచ్చే విద్యుత్‌తో వండుతారు. తక్కువ మొత్తంలో మాత్రమే గ్యాస్ వినియోగం ఉంటుంది. అయితే దీనికి నిల్వలు ఉన్నాయని, మరికొంత కాలం ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే రీతిలో అందరూ వాడితే గ్యాస్ వినియోగం తగ్గించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News March 14, 2026

‘500 మంది ‘సైబర్ సింబా’లకు శిక్షణ’

image

సైబర్ నేరగాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేరాలు ఆగడం లేదు. దీంతో ‘సైబర్ సింబా’ పేరుతో వాలంటీర్లను సిద్ధం చేశారు. తొలిదశలో 500 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు పోలీస్ స్టేషన్‌తో అనుసంధానమై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వీరికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ నేరాల అడ్డుకట్టలో భాగం కావాలని పిలుపునిచ్చారు.