News August 10, 2024
కొత్త రేషన్ కార్డులు.. అర్హతలు ఇవే!
TG: పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50ఎకరాలు, చెలక 7.5ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని ప్రతిపాదించింది. 2 రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనుంది.
Similar News
News February 7, 2025
ఈ ఊళ్లో అసలు చెప్పులు వేసుకోరు..!
AP: తిరుపతికి 50 కి.మీ దూరంలో ఉన్న ఉప్పరపల్లి పంచాయతీ వేమన ఇండ్లు గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. ఆ గ్రామానికి కలెక్టర్, సీఎం వచ్చినా ఊరవతల చెప్పులు వదిలి రావాల్సిందే. ఇది వారి తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. వేంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తితోనే వారు చెప్పులు ధరించరు. బయట ఫుడ్ అసలు తినరు. స్కూళ్లో మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి వ్యక్తులను తాకరు. అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రులకు వెళ్లరు.
News February 7, 2025
భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అనిల్ కుంబ్లే (956) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రవిచంద్రన్ అశ్విన్(765), హర్భజన్ సింగ్ (711), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610), రవీంద్ర జడేజా (600), జవగళ్ శ్రీనాథ్ (551), మహ్మద్ షమీ (452) ఉన్నారు. ఇవాళ్టి మ్యాచులో జడేజా 600 వికెట్ల ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో మీ ఫేవరెట్?
News February 7, 2025
మహారాష్ట్రలో 173 GBS కేసులు
మహారాష్ట్రలో <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> కేసుల సంఖ్య 173కి చేరింది. ఇవాళ కొత్తగా 3 కేసులు నమోదవగా, ఒక మరణం సంభవించింది. దీంతో ఆ రాష్ట్రంలో GBS అనుమానిత మరణాల సంఖ్య 6కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 72 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. పుణే సిటీలో 34, మున్సిపాలిటీ సరిహద్దు గ్రామాల్లో 87, ఇతర ప్రాంతాల నుంచి మిగిలిన కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.